రామగిరి, జూలై 24 : విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ మరింత ముందుకు వెళ్తున్నది. పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయించి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేలా నిపుణులతో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నారు యూనివర్సిటీ వీసీ ప్రొ.చొల్లేటి గోపాల్‌రెడ్డి.
గత సంవత్సంర మే 24న వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తనదైన శైలిలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలతో ఎంజీయూను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ అజాతశత్రువుగా పలువురి మన్నలు పొందుతున్నారు.
విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు ప్రభుత్వ
ఆదేశాలతో, అధికారుల సమన్వయంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ఎంజీయూలో నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను
త్వరలోనే ప్రారంభించనున్నాం. అందరి సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి పరిశోధనా కేంద్రంగా ఎంజీయూను తీర్చిదిద్దుతాం.
– ప్రొ.సీహెచ్ గోపాల్‌రెడ్డి, వీసీ, ఎంజీయూ