తుంగతుర్తి, మే 16 : కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై వినూత్న రీతిలో ఆటోకు తాడుకట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ.. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ధరలు పెరగడం ద్వారా సామాన్య ప్రజలపై భారం పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కేంద్ర మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఎటువంటి భారాన్ని ప్రజలపై వేయమని, ధరలు పెంచబోమని మాటలు చెప్పి పది రోజులు కాకుండానే వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచుతూ ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఉందన్నారు.
డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వెంటనే ధరలు తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్, మల్యాల రాములు, సోమేష్, గోపగాని శ్రీనివాస్, గుండగాని లక్ష్మయ్య, మల్లేష్, సింహాద్రి, సర్పంచ్ రమేష్, మహేష్, కదారి దాసు, ఉప్పల వీరయ్య, యాకూబ్, రవి, వీరోజీ, ఉప్పల నాగమల్లు, యాకూబ్ పాల్గొన్నారు.