తల ‘సిరి’ భేష్
తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది.
- రాష్ట్ర తలసరి ఆదాయంలో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
- స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో నల్లగొండకు ఐదో స్థానం
- ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్‌లో వెల్లడి
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఇక ఉమ్మడి జిల్లాలో నల్లగొండ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఈ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 1,38,093గా నమోదైంది. రూ. 1,12,555 తలసరి ఆదాయంతో 16వ స్థానంలో సూర్యాపేట నిలిచింది. రంగారెడ్డి జిల్లా రూ. 4,74,404 తలసరి ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఒక భౌగోళిక ప్రాంతంలో వ్యక్తి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కొలవడమే తలసరి ఆదాయం. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో సగటున వ్యక్తి ఆదాయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ప్రాంతం జీవన నాణ్యతను పరిశీలించడానికి తలసరి ఆదాయాన్ని ఉపయోగిస్తారు.
జీడీడీపీలో మెరుగైన స్థానం..
స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో ఉమ్మడి జిల్లా మంచి మెరుగైన స్థానం సంపాదించింది. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. నల్లగొండ స్థూల జిల్లా దేశీయోత్పత్తి రూ. 26,965 కోట్లుగా నమోదైంది. రూ. 14,889 కోట్లతో పదో స్థానంలో సూర్యాపేట, రూ. 13,587కోట్లతో 14వ స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. రూ. 1,44,562 కోట్లతో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంది. స్థూల జిల్లా దేశీయోత్పత్తి అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఆ జిల్లాలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మార్కెట్ విలువ. స్థూలంగా దేశీయంగా ఉత్పత్తులను కొలిచే ప్రమాణంగా ఇది ఆ జిల్లా ఆర్థిక పరిపుష్టతను సూచిస్తుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

