తుంగతుర్తి, ఏప్రిల్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, అన్నారం, గొట్టిపర్తి, బండ రామారం, సంగెం గ్రామాల ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరు గ్యారెంటీలపై అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు, మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణ లక్ష్మీకి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు, రెండు లక్షల రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు నాలుగు నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఈ నెలాఖరు వరకు రైతులకు సాగునీరు అందించాలని ఆయా గ్రామ సభలోని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రజల నిలదీత