చౌటుప్పల్/భద్రాచలం, ఆగస్టు 6 : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పిం ది. గురువారం ఎమ్మెల్యే తన కారులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న ఎమ్మెల్యే కారును వెనుక నుంచి వచ్చిన లారీ వచ్చి ఢీకొన్నది.
ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు ఓ వైపున దెబ్బతిన్నది. ఆయనకు గాయాలు కాకపోయినా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కాసేపటి తర్వాత ఎమ్మెల్యే మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు.