మునుగోడు, ఆగస్టు 22 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు. “పనుల జాతర” లో భాగంగా శుక్రవారం మునుగోడు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి పనులు ప్రారంభించారు. కొంపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభ, పనుల జాతరలో ఆయన పాల్గొని మాట్లాడారు.
భూగర్భ జలాలు పెంపొందించడానికి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నారు. గ్రామంలో చేపట్టిన పనులను (గ్రామ పంచాయతీ వద్ద వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, జడ్పీహెచ్ఎస్, ప్రైమరీ స్కూల్స్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, డీపీఓ కె.వెంకయ్య, ఏపీడీ నవీన్, ఎంపీడీఓ యుగంధర్, ఎంపీఓ అథర్ పర్వేజ్, పంచాయతీ కార్యదర్శి స్వామి, ఇన్చార్జి ఏపీఓ నాగరాజు, ఈసీ మల్లేశ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Munugode : ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : రవీందర్రావు