కోదాడ, ఏప్రిల్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అప్పు పుట్టడం లేదని, హామీలను అమరపరచలేమని చేతులెత్తేసిన విషయాన్ని ప్రజలు అవగతం చేసుకున్నట్లు తెలిపారు. సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్లో నిర్వహిస్తున్న కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
కోదాడ నుంచి 24న బయల్దేరే పాదయాత్ర 27న సభా ప్రాంగణానికి చేరుకుంటుందని వివరించారు. కోదాడ పట్టణం నుండి భారీగా బయల్దేరేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మేదర లలిత వెంకట్, చంద్రశేఖర్, చింతల నాగేశ్వరరావు, పిట్టల భాగ్యమ్మ, ఇమ్రాన్ ఖాన్, అబూబకర్, సుందర్ బాబు, చలిగంటి వెంకట్, మల్లయ్య గౌడ్, చీమ శ్రీనివాసరావు, శ్రీధర్, కృష్ణయ్య, జానీ, షాకీర్, వంశీ, వీరబాబు, బాలకృష్ణ, ఉపేందర్, వెంకటనారాయణ, శ్రీకాంత్, రవి, లక్ష్మయ్య, పట్టణ నాయకులు పాల్గొన్నారు.