దామరచర్ల, సెప్టెంబర్ 20 : మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చలో గ్రామ పంచాయతీ కార్యాలయం పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే వికలాంగులకు రూ.6 వేలు, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ధర్నా అంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సందాల శంభయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, దామరచర్ల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు గద్దల సత్యం మాదిగ, వీహెచ్పీఎస్ గణపురం శివ నాయడు, బైరం శ్యారి లక్ష్మి, ఎంఆర్పీఎస్ నాయకులు సందాల నవీన్, వెంకటేష్, రవి. మార్కు పాల్గొన్నారు.