రామగిరి, ఏప్రిల్ 16: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది. దీన్ని నిరసిస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని కార్యాలయ వద్ద ధర్నాలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేస్తున్నట్లు టీజీఈజేఏసీ కార్యదర్శి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలోని కలెక్టర్, డివిజన్, మండలా కేంద్రాలలోని కార్యాలయ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఎన్జీవో బాధ్యులు శేఖర్ రెడ్డి, యాకూబ్ నాయక్, వంగూరి భాస్కర్, పీఆర్టీయూ అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మగోటి జనార్దన్, తరాల పరమేష్, టీఎస్టీయూఎఫ్ బాధ్యులు నర్రా శేఖర్ రెడ్డి, నలపరాజు వెంకన్న, యడ్ల సైదులు, ఆంజనేయులు, గేర నరసింహ, వివిధ సంఘాల నాయకులు సీహెచ్ లింగయ్య, మనోజ్ ప్రదీప్, వంగూరు విజయకృష్ణ, సైదులు నాయక్, రవి నాయక్, డీఐ రాజు, రణదీవే, సత్యనారాయణ, మహ్మద్ హనీఫ్, మురలయ్య, కె. సైదులు, పి. సైదులు, రవీందర్, భాను ప్రకాష్, యన్. సైదులు, మధు పాల్గొన్నారు.
సూర్యాపేట, ఏప్రిల్ 16 : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ ఎస్కే జానిమియా, డిప్యూటీ జనరల్ సెక్రటరీ తంగెళ్ళ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ కోచైర్మన్లు సోమయ్య, పబ్బతి వెంకటెశ్వర్లు, పుప్పాల వీరన్న, గెజిటెడ్ అధికారుల సంఘం సెక్రటరీ పాండు నాయక్, రవికుమార్, కో చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, దండ శ్యాంసుందర్‌రెడ్డి, భూపతి వెంకన్న, డిప్యూటీ సెక్రటరీ దున్న శ్యాం, లక్కపాక ప్రవీణ్, డాక్టర బట్టు గోపి, కోశాధికారి ఆకాశ్ వర్మ, గెజిటెడ్ లెక్చరర్ల సంఘం కార్యదర్శి కృష్ణ, సైదులు, పోతురాజు నర్సయ్య పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం భువనగిరిలో జరిగిన ఉద్యోగ సంఘాల సన్నాహక సమావేశానికి అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల 13వేల కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని యథావిధిగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు భగత్, పీఆర్టీయూ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదయ్య, టీజీవో అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రెసా అధ్యక్షుడు కృష్ణ, టీఎన్జీవో నాయకులు శ్రీకాంత్, శశికాంత్, లక్ష్మీనర్సింహా రెడ్డి, శైలజ, శ్రీనివాస్, లింగయ్య, దుర్గాప్రసాద్, నర్సిరెడ్డి పాల్గొన్నారు.