ఇస్లాంనగర్‌లో 60 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
కనగల్: పేద ప్రజల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని ఇస్లాం నగర్ గ్రామపంచాయతీలో 60 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లను నాణ్యత ప్రామాణాలు పాటించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల రూపురేఖలు మారాయన్నారు.
ఆయన వెంట ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్య క్షుడు ఐతగోని యాదయ్యగౌడ్, పీఎసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, సర్పంచ్ హేమనాయక్, నాయకులు గోన రవీందర్రావు, బోయపల్లి జానయ్యగౌడ్, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, హనుమంతునాయక్, చింతల యాదగిరి, దాసరి వెంకన్న డీఈ నాగయ్య, తహసీ ల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.