కట్టంగూర్, మే 26 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలకు వచ్చి తక్కువ ధరలకు విక్రయించే విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వెంటనే రసీదులను తీసుకోవాలని సూచించారు. ఆరుగాలం కష్టపడే రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను అందించే బాధ్యత డీలర్లు, విత్తన కంపెనీలపై ఉందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.