గరిడేపల్లి, ఏప్రిల్ 11 : రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలం సర్వారం శివారులో శనివారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం చేన్నారిగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ మాతంగి రాజు (45) ఈ ఉదయం లక్ష్మీపురం చర్చిలో ప్రేయర్ పూర్తి చేసుకుని బైక్ పై సర్వారం మీదుగా కీతవారిగూడెం చర్చికి ప్రేయర్ కోసం వెళ్తున్నాడు. అదే సమయంలో సర్వారం శివారులో ఎదురుగా వచ్చిన గడ్డి మిషన్ ట్రాక్టర్ ను తగడంతో 15 అడుగుల దూరం ఈడ్చుకెళ్లడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల మండల పాస్టర్ల సంఘం సంతాపం వ్యక్తం వ్యక్తం చేసింది.