భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాదం కోసం వచ్చే ప్రజలకు పార్కుల్లో అన్ని వసుతులు ఏర్పాటు చేయాలన్నారు.
పార్లుల్లో కూర్చోవడానికి బేంచీలు, వాకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించాలన్నారు. పిల్లలకు అవసరమయ్యే క్రీడా పరిక రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.పూర్ణచందర్, డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.