యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహిం చారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంటన్నర పాటు రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే పర మశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు.
పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయం లోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.