మునుగోడు ,ఏప్రిల్ 18: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్లోని ఆమె నివాసంలో మునుగోడు నియోజకవర్గ నాయకులు ఘనంగా నిర్వహించారు .ఈ వేడుకలలో పార్టీ శ్రేణులు, నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మునుగోడు మండల నాయకులు నేతృత్వంలో జరిగిన వేడుకలలో భారీ గజమాల వేశారు. అనంతరం ఆంగ్ల అక్షరాలతో ఏర్పాటుచేసిన భారీ కేకును పాల్వాయి స్రవంతితో కట్ చేయించి అభిమానులకు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ జీవితంలో కొన్ని మధురానుభూతులు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. మునుగోడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించే ఆప్యాయత, అనురాగాలు కూడా అలాంటిదే అన్నారు. ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ వారి ప్రేమకు సర్వదా దాసోమన్నారు. ఈ కార్యక్రమంలో మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, పోలగోని సైదులు గౌడ్, పాల్వ వెంకటరెడ్డి, గజ్జల బాలరాజు గౌడ్, సురేష్, ఉదయ్ కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు.