కోదాడ, జూన్ 02 : ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు త్రివిద దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మకమని విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎంవీరెడ్డి, బుర్రి రామయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్ చైతన్యపురి అపోలో కాన్ఫరెన్స్ హాల్లో కోదాడ ప్రవాస ఆత్మీయ సమితి సెల్యూట్ టు సోల్జర్స్ పేరుతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ భద్రత, రక్షణలో త్రివిధ దళాలు నిబద్దతతో పనిచేసినట్లు, వారి సేవలను గుర్తించాలన్నారు.
ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న మేజర్ సాయి భార్గవ్ తన అనుభవాలను వివరిస్తూ.. పాకిస్తాన్ డ్రోన్లను ఎలా తిప్పికొట్టామో చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఆర్మీ అధికారులు స్వర్ణరెడ్డి, స్వామి నరసింహారెడ్డి, రామనాథం, సుదర్శన్, దయాకర్‌రెడ్డి, నరసయ్యను ఘనంగా సన్మానించారు. సంఘోజు నాగాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అపోలో అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన్, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, కోదాడ ఆర్పీఎస్ సమితి సభ్యులు అంజయ్య, శ్రీనివాస్, కళింగరావు, సతీశ్, వెంకటేశ్వరరావు, నారాయణరావు, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.