నకిరేకల్, మే 30 : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కాల్చివేతను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ నకిరేకల్ 7వ మండల మహాసభ పాల్వాయి విద్యాసాగర్ అధ్యక్షతన పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించడం దేశ పౌరులను హత్య చేయడమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి గౌని లక్షీనర్సయ్య, సహాయ కార్యదర్శి పాల్వాయి విద్యాసాగర్, నాయకులు జంగయ్య, లక్ష్మారెడ్డి, భద్రయ్య పాల్గొన్నారు.