మునుగోడు, మే 29 : ఉద్యాన శాఖ మునుగోడు ఆధ్వర్యంలో ఉద్యాన పంటలు – సాగు యాజమాన్యంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జూన్ 3వ తేదీన మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు చెందిన యువ రైతులు శిక్షణకు హాజరు కావొచ్చన్నారు. ఆసక్తి కలిగిన రైతులు తమ పేరు, గ్రామం, మండలం, ఫోన్ నంబర్‌ను 8977714162 కి వాట్సాప్ ద్వారా తెలియజేయొచ్చని పేర్కొన్నారు.