సూర్యాపేట, నవంబర్ 10 : ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేందుకు ఇంటిని అద్దెకు ఇస్తే మూడేళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పాఠశాలకు తాళం వేసిన సంఘటన సూర్యాపేటలోని తిలక్‌నగర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. అయితే విషయం తెలియని విద్యార్థులు పాఠశాలకు వచ్చి రెండు గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిలక్‌నగర్ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కోసం అద్దెకు తీసుకున్న భవనానికి మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని స్కూల్ గేటుకు తా ళం వేశారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
కాగా భవన యజమానికి మూడేళ్లుగా కిరాయి చెల్లించాల్సిన మాట వాస్తవమేనని, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తాము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని పాఠశాల నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల కిరాయి మా త్రమే మంజూరైనట్లు అధికారులు చెప్పారు. స్కూల్ గేటుకు తాళం వేసిన నేపథ్యంలో విద్యాధికారులు పాఠశాల విద్యార్థులను సమీపంలోని హైస్కూల్‌కు తరలించారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బకాయిల సమస్యను త్వరగా పరిష్కరించి పాఠశాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.