గట్టుప్పల్, జూలై 25 : ఎన్నికల కోడ్ నిబంధనలు లేకున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను సిబ్బందిని పంపి మండల అధికారులు కావాలని తొలగించడం సరికాదని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యయుతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ పార్టీ నేతలు మరుసటి రోజే ఊరంతా ఆ పార్టీ నేతలకు సంబంధించిన ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
గట్టుప్పల పద్మశాలి వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ప్రజా ప్రతినిధిగా ఆహ్వానిస్తేనే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నానని, కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు రెచ్చగొట్టి అధికారులతో శిలాఫలకాన్ని తీసేపియడం విద్వేష రాజకీయాలకు తావుతీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు అభివృద్ధి కోసం పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాస్, తేరట్పల్లి మాజీ ఎంపీటీసీ గోరేగే సత్తయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, నాయకులు చిలుకూరి అంజయ్య, పున్న కిశోర్, కర్నాటి వెంకటేశం, నేలంటి వెంకటేశం, నారని జగన్, బావండ్ల శ్రీనివాస్, కర్నాటి అబ్బయ్య, చెరుపల్లి నాగేశ్, పున్న ఆనంద్, దుబ్బాక మల్లేశం, గుర్రం యాదయ్య, తిగుళ్ల ఈశ్వరప్ప, చిలివేరు అయోధ్య పాల్గొన్నారు.