నల్లగొండ, నవంబర్ 15 : నల్లగొండ రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగ్ భట్‌లకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఖో – ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైంది. ఈ నెల 14న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్- 14 విభాగంలో ఎస్జీఎఫ్ సెలక్షన్స్ కం చాంపియన్‌షిప్ పోటీలో పాఠశాలకు చెందిన విద్యార్థిని తిరుమల అంకిత ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు.
ఈ నెలలో వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అంకిత ఆడనున్నట్లు చెప్పారు. ఈ మేరకు విద్యార్థినినీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.మారయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మల్లీశ్వరీ, ఉపాధ్యాయులు బి.యాదయ్య, కె.రవీంద్రచారి, యాదగిరి, గోపాల్‌రెడ్డి, సైదులురావు, వేణుకుమార్, వినోద్ కుమార్, రామకృష్ణ, లతీఫున్నీసా బేగం, పద్మావతి, శ్రీదేవి, వాణి, శోభారాణి, వనజాదేవి, పలువురు గ్రామస్తులు అభినందించారు.