హస్తవ్యస్తం.. ధ్వంస రచన
ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో భూములు లాక్కొనే ప్రయత్నం చేయడం.. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చేయటం, యూనివర్సిటీల భూములను లాక్కోవడానికి ప్రయత్నించడం, వేలమందికి నిద్రలేని రాత్రులు మిగల్చటం ఇదీ రేవంత్ ప్రభుత్వం రెండున్నరేండ్లుగా చేస్తున్న ఏకైక పని.
రెండున్నర వేల ఇండ్ల కూల్చివేత..గూడు కోల్పోయిన మూడు వేల కుటుంబాలు, నిర్వాసితులైన పాతిక వేల మంది, ధ్వంసమైన రూ.15 వేల కోట్ల ఆస్తి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేండ్లలో జరిగిన పరిపాలనకు ఈ లెక్కలు అద్దం పడుతున్నాయి. రేవంత్ మాడల్ అంటే యావత్ దేశమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విధంగా సాగుతున్న పరిపాలన ఇది. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలు తొలగింపు, చెరువుల పరిరక్షణ, నది పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల రికవరీ అనే ముసుగులో యథేచ్ఛగా ప్రారంభమైన విధ్వంసకాండ. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో 10 వేల ఇండ్ల కూల్చివేత వరకు నిరంకుశంగా సాగుతూ వస్తున్నది.
ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో భూములు లాక్కొనే ప్రయత్నం చేయడం.. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చేయటం, యూనివర్సిటీల భూములను లాక్కోవడానికి ప్రయత్నించడం, వేలమందికి నిద్రలేని రాత్రులు మిగల్చటం ఇదీ రేవంత్ ప్రభుత్వం రెండున్నరేండ్లుగా చేస్తున్న ఏకైక పని. అమలు చేస్తున్న పరిపాలనా విధానం. తమకు అనుకూలురైన వారి ఇండ్లు, ఫామ్‌హౌస్‌ల జోలికి పోకుండా.. భారీ నిర్మాణాల వైపు తలెత్తకుండా, కేవలం నోరు లేని పేదల ఇండ్లను నేలమట్టం చేయడమే పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ సర్కార్. కూల్చివేతలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసి ఎదురుదాడి చేయడం పరిపాటిగా మారింది. చెరువులు, కాలువల పరిరక్షణ ముసుగులో ప్రభుత్వం అధికారులు, బుల్డోజర్లు పంపి అనేక ప్రాంతాల్లో పేదల ఇండ్లను కూల్చివేసింది. ప్రభుత్వ అనుమతులతో లేదా స్థానిక మున్సిపల్ రికార్డుల ఆధారంగా నిర్మించుకున్న ఇండ్లు అవి. కొంతమంది తమ జీవితకాల పొదుపుతో లేదా అప్పులు తీసుకొని ఇండ్లు నిర్మించుకున్నారు. అలాంటి ఇండ్లను ఒక్కరోజులో కూల్చివేయడం రేవంత్ సర్కార్ ఫ్యూడలిస్టిక్ ఆలోచనకు నిదర్శనం.
మూసీ నది పరిసరాల్లో వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. వీరిలో చాలామంది రోజువారీ కార్మికులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు వంటి తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారు. నది అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల్లో తీవ్ర భయం నెలకొన్నది. అధికారికంగా పునరావాసం ఇస్తామని చెప్పినప్పటికీ, తమ అనుభవం మాత్రం వేరుగా ఉన్నదని బాధితులు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో పునరావాస ఇండ్లు దూరప్రాంతాల్లో ఉండటం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, తాత్కాలికంగా నివసించే సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు పేదల జీవనాధారాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉన్నది.
ఇప్పటివరకు డీపీఆర్ లేదు.మరో 18 నెలల దాకా డీపీఆర్ తయారుకానే కాదని ప్రభుత్వమే చెప్తున్నది. అలాంటప్పుడు ఉన్నపళంగా ఇండ్లను కూల్చేయాల్సిన అవసరం ఏమున్నది. మరో 10 వేల ఇండ్ల కూల్చివేతకు గెజిట్ కూడా ఇచ్చేశారు. డీపీఆర్ వచ్చిన తర్వా దాని ప్రకారం ఏ
పరిధిలో ఏంచేయాలో నిర్ణయం తీసుకోవచ్చు. డీపీఆర్ ప్రాథమికంగా కూడా తయారుకాకుండా ప్రజలను భయాందోళనలకు గురిచేయడం
ఎంతవరకు సమంజసం?
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో కొద్దిరోజుల కిందట జరిగిన భారీ కూల్చివేతలు దాదాపు వెయ్యి కుటుంబాలను రాత్రికి రాత్రి రోడ్డున పడేశాయి. భూదాన్ భూముల్లో కొన్నేండ్ల క్రితం వేసుకున్న ఇండ్లలో దాదాపు అన్నింటినీ కూల్చేశారు. ఈ చర్యతో సుమారు 5 వేల మంది పేదలు నిర్వాసితులయ్యారు. భూదాన్ భూములను ప్రభుత్వ భూమిగా చూపించి నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. బాధితులకు కనీసం ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇండ్లను కూల్చిన తర్వాత పునరావాస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉన్నపళంగా రోడ్డుమీదకు తెచ్చిపడేశారు. ప్రభుత్వ దుందుడుకుతనం వల్ల పేదల జీవితం ఛిద్రమైపోయింది.
లగచర్లలో గిరిజనుల భూములు లాక్కోవడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అబ్దుల్ కలాం యూనివర్సిటీ, బిజినెస్ స్కూల్ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేయడం, నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలన్నీ రేవంత్ పరిపాలన ప్రాధాన్యాలేమిటో చెప్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ ఏదో పేరుతో బకాసురుడిలా భక్షించేయడం, అభివృద్ధి పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వ్యాపారులకు పెద్దపీట వేయడం మాత్రమే పరిపాలనగా కనిపిస్తున్నది. ఇంతకు మించి ఏ ప్రాధాన్యమూ ప్రభుత్వానికి లేదని స్పష్టంగానే తెలుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు జిల్లాల్లో కూల్చివేసిన వివరాలు పై పట్టికలో ఉన్నాయి.
ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ, నగరాభివృద్ధి వంటి లక్ష్యాల కంటే కూడా ప్రజల జీవితాలను కుదిపేయటమే లక్ష్యంగా కనిపిస్తున్నది. అభివృద్ధి, ప్రజల హక్కుల మధ్య సమతౌల్యం ఉండాలి. అసలు ప్రణాళిక అన్నదే లేకుండా ఏకంగా 10 వేల కట్టడాలను కూల్చేయడానికి గెజిట్ ఇవ్వడాన్ని ఏ విధంగా నిర్వచించాలో కూడా అర్థం కాదు. ఇది రేవంత్ సర్కార్‌కు ఎంతమాత్రం తగని పని. ఈ అంశంపై ఇప్పటికైనా మేధావులు నోరు విప్పాలి.
-కోవెల సంతోష్‌కుమార్
తెలంగాణలో కూల్చివేతల టైమ్‌లైన్ (జిల్లాల వారీగా)
నెల/సంవత్సరం జిల్లా/ప్రాంతం/చర్య/కూల్చిన నిర్మాణాలు/ప్రభావిత కుటుంబాలు
- జనవరి 2024 = హైదరాబాద్ జూబ్లీహిల్స్/చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమణ తొలగింపు/3540
- ఫిబ్రవరి 2024 = రంగారెడ్డి గండిపేట/చెరువు భూమి ఆక్రమణ/4860
- మార్చి 2024 = మేడ్చల్ శామీర్‌పేట్/ప్రభుత్వ భూమి ఆక్రమణ/2735
- ఏప్రిల్ 2024 = హైదరాబాద్నార్సింగి/వాణిజ్య నిర్మాణాల తొలగింపు/2220
- మే 2024 = హైదరాబాద్ మాదాపూర్/చెరువు బఫర్ జోన్/6080
- జూన్ 2024 = రంగారెడ్డి కోకాపేట్ రోడ్డు విస్తరణ/1815
- జూలై 2024 = హైదరాబాద్ హైడ్రా మొదటి డ్రైవ్/చెరువు ఆక్రమణలు/120150
- ఆగస్టు 2024 = హైదరాబాద్ఖాజాగూడ లేఅవుట్ ఆక్రమణ/4550
- సెప్టెంబర్ 2024 = హైదరాబాద్హఫీజ్పేట్ కాలువ ఆక్రమణ/7090
- అక్టోబర్ 2024 = హైదరాబాద్ చాదర్‌ఘాట్ (మూసీ) నది బేడ ఇండ్లు/163200
- నవంబర్ 2024 = హైదరాబాద్అంబర్పేట్ నది పరిసర నిర్మాణాలు/75100
- డిసెంబర్ 2024 = రంగారెడ్డి శంషాబాద్ రోడ్డు విస్తరణ/4050
- జనవరి 2025 = వరంగల్ చెరువు భూమి ఆక్రమణ/2830
- మార్చి 2025 = సంగారెడ్డి ప్రభుత్వ భూమి/3340
- జూలై 2025 = హైదరాబాద్ శివారులో చెరువుల పరిరక్షణ డ్రైవ్/90120
- అక్టోబర్ 2025 = హైదరాబాద్ మూసీ ఫేజ్-2 నది పరిసర నిర్మాణాలు/300+350
- ఫిబ్రవరి 2026 = ఖమ్మంవెలుగుమట్ల భూదాన్ భూమి ఆక్రమణ/60010001000 కుటుంబాలు
మొత్తం ప్రభావం (అంచనా)

Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

