మేళ్ళచెరువులో.. భూదాన్ భూమి ఆక్రమణ
నియోజకవర్గంలోని మేళ్ళచెరువులో భూదాన్ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూమిని మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
- 150 ఎకరాల పేదలకు చెందిన భూమి అన్యాక్రాంతం
- ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు
- సీసీఎల్ఏ కమిషనర్ సహా 11మంది అధికారులకు నోటీసులు
హుజూర్నగర్, ఏప్రిల్ 10: నియోజకవర్గంలోని మేళ్ళచెరువులో భూదాన్ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూమిని మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారికి ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక న్యాయవాది కమతం నాగార్జున మండల లీగల్ సర్వీస్ అధారిటీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదకు ఇటీవల ఫిర్యాదు చేశారు.
భూదాన్ బోర్డు సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, కలెక్టర్ సూర్యాపేట, ఆర్డీవో హుజూర్నగర్, తహసీల్దార్ మేళ్ళచెరువు, పంచాయతీ కార్యదర్శి మేళ్ళచెరువు, జిల్లా పంచాయతీ అధికారి సూర్యాపేట, ఎస్సై మేళ్ళచెరువు, జిల్లా ఎస్పీ సూర్యాపేట, కీర్తి, మైహోం సిమెంట్స్ ఎండీలతో కలిసి మొత్తం 11మందిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదేండ్లుగా 150 ఎకరాల భూదాన్ భూములను సిమెంట్ కంపెనీలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు.
ఆక్రమణలకు ప్రభుత్వం అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని గతంలోనే హుజూర్నగర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది కమతం నాగార్జున తెలిపారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండడం వల్ల గతంలో జిల్లా కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టులో తుది తీర్పు వెలువడడంతో మరలా భూదాన్ భూముల అన్యాక్రాంతం విషయం వెలుగులోకి వచ్చింది.
150 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై మళ్లీ న్యాయవాది నాగార్జున హుజూర్నగర్ మండల లీగల్ సర్వీస్ అధారిటీ జడ్జి వద్ద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వాదనలు విన్న సదరు సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 29న కోర్టుకు హాజరై సమాధానం దాఖలు చేయాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

