నిడమనూరు, డిసెంబర్ 1 : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. గురువారం నర్సింహాయ్య రెండో వర్దంతిని పురస్కరించుకుని మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల పక్షాన నిరంతరం తన గళాన్ని వినిపించి, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి నోముల నర్సింహయ్య అని కొనియాడారు. సామాన్యుల చెంతకు సీఎం సహాయ నిధిని చేరువ చేసిన మహనీయుడన్నారు.
నోముల స్ఫూర్తితో నాయకులు ప్రజా సేవకు పునరంకితం కావాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు చేకూరి హనుమంతరావు, సాదం సంపత్‌కుమార్, నూకల వెంకట్‌రెడ్డి, రాం అంజయ్య యాదవ్, బొల్లం రవియాదవ్, కామర్ల జానయ్య, లకుమాల మధుబాబు, మర్ల చంద్రారెడ్డి, వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతీఅశోక్, ఎంపీటీసీలు చిలుముల సంతోశ్, పెదమాం యాదయ్య, మాచర్ల దాసు, కంపసాటి గంగాభవాని, అల్వాల కళావతి, రావిరాల శ్రీలత పాల్గొన్నారు.
నందికొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నర్సింహయ్య వర్ధంతిని పురస్కరించుకుని నందికొండ హిల్‌కాలనీలోని నెహ్రూ పార్కులో నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. కాంస్య విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడడానికి, కొత్త గా 100 పడకల దవాఖాన నిర్మాణానికి, లాంచీ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోముల నర్సింహాయ్య ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం పైలాన్, హిల్‌కాలనీలో రూ.9 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్జతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనుషారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, రమేశ్‌జీ, మంగ్తానాయక్, టౌన్ బంజార సేవ సంఘం అధ్యక్షుడు రమావత్ మోహన్‌నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాస్ విక్రమ్, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి భూషరాజుల కృష్ణ, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి బషీర్, టౌన్ అధ్యక్షుడు కొండలు, సంపత్, వెంకట్‌రెడ్డి, రవినాయక్, చంద్రమౌలి, రాందాసు, శ్రీను, కేశవులు, చాంద్‌పాషా పాల్గొన్నారు.