రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో న్యాక్ బృందం పర్యటన చేయనుంది. అయితే కళాశాలకు న్యాక్(నేషనల్ అసిసెమెంట్ అండ్ అక్రి డేషన్ కౌన్సిలర్) బృందం ఈనెల 25, 26న నల్లగొండలోని కళాశాలకు చేరుకుంటుంది. కాగా న్యాక్ గుర్తింపుకై ఇదే సంవత్పరం ఫిబ్రవరి 4, 5న న్యాక్ వచ్చింది. అప్పుడు కళాశాల సందర్శనలో పలు డిపార్టుమెంట్స్ వారు సక్రమంగా రికార్డుల నిర్వహణ చేయలేదని తెలిసింది. వాటిని తిరిగి పునఃపరిశీలన చేసి న్యాక్ గుర్తింపు ఇచ్చేందుకు మరల ప్రత్యేక సందర్శనకు వస్తున్నారు.
ఈ క్రమంలో తొలి రోజు కళాశాలకు చెందిన అకాడమిక్ అంశాలు, కళాశాల చరిత్ర, వివిధ డిపార్టుమెంట్స్ సందర్శన, అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న విద్య, మౌలిక వసతులను పరిశీలిస్తారు. రెండో రోజు ఎన్జీ కళాశాల అలుమీని(పూర్వవిద్యార్ధుల)తో సమావేశం నిర్వహించి పలు అంశాలను సేకరిస్తారు. ఇందుకు సం బంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు అన్ని డిపార్టుమెంట్లలో రికార్డులను సిద్ధం చేసినట్లు తెలుసుకుని నమస్తే తెలంగాణ పలుకరించగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ తనిఖీకా వస్తారని నిర్ధారించారు.