సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి బదిలీ
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్‌పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్‌గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్‌గా పి.రామానుజులరెడ్డి మూడేళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాల్టీ ప్రజలకు విషేష సేవలందించారు
కొత్త కమిషనర్‌గా సత్యనారాయణరెడ్డి
బొడ్రాయిబజార్, మే 17 : సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్‌పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్‌గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్‌గా పి.రామానుజులరెడ్డి మూడేళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాల్టీ ప్రజలకు విషేష సేవలందించారు. కరోనా సమయంలో మీ కోసం యాప్ రూపొందించి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందించారు.
మున్సిపల్, పారిశుధ్య సిబ్బందికి ధైర్యం చెప్పి వారితో పనులు చేయించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సూర్యాపేటగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. కమిషనర్ రామానుజులరెడ్డి హయాంలో సూర్యాపేట మున్సిపాల్టీకి స్కోచ్ అవార్డు రావడంతో పాటు మూడేళ్లుగా 100శాతం పన్ను వసూలు చేసినందుకు ఉత్తమ కమిషనర్‌గా అవార్డును అందుకున్నారు. చెత్త నుంచి ఆదాయం సమకూర్చేందుకు సింగిల్ యూజ్ వేస్ట్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన అక్యూప్రజర్ మ్యాట్, ప్లాస్టిక్ ఇటుకలు, టైల్స్‌ను ఇటీవల రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

