హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ.. తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇవ్వాలో నిర్ణయించడానికి ఏపీ ఈఎన్సీ ఎవరని ప్ర శ్నించారు. కృష్ణా బేసిన్లో ఏపీ పెత్తనం చేసేందుకు మళ్లీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఇదంతా ఆంధ్రా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నదని, ఇంత జరుగుతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణకు రిజర్వాయర్లు లేవని స్వయంగా తెలంగాణ ఈఎన్సీనే కేఆర్ఎంబీకి లేఖ రాయడం, ఏపీకి వత్తాసు పలుకడమేనని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలకు ఆదిత్యనాథ్ దాస్ బాస్‌గా ఉన్నారని, ఆయన పూర్తిస్థాయిలో ఏపీ ప్రయోజనాలకే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉండాలంటే అధికారులు బాధ్యతగా నడుచుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉండటంతోనే ఏపీ ప్రభుత్వానికి ధైర్యం ఎకువైందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండితే మిగులు జలాలను తీసుకెళ్లేందుకు ఏపీ అధికారులు వలిగొండ, నల్లమలసాగర్ ప్రాజెక్టులకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 300 టీఎంసీల నీటిని తరలించుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏపీ అధికారుల ఆటలు సాగలేదని, ఇప్పుడు తెలంగాణ నీళ్లు ఏపీకి పోతుంటే కడుపు మండుతున్నదని శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులపై ఇస్తున్న భారీ ప్రకటనలు ప్రచార ఆర్భాటమేనని ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొ టోలు ఎందుకు? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేతల ఫొటోలు వేసుకున్నంత మాత్రాన ప్రజల అభిమానాన్ని పొందలేరని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభు త్వం విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టి ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానా న్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు. సమావేశంలో సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కల్యాణ్‌రావు, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.