తుంగతుర్తి, మే 14 : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నరేశ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అనిశ్చితిలోకి నెట్టిందని విమర్శించారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఉప్పుల రాంబాబు, ఎల్లబోయిన శ్రీకాంత్, కొండగడుపుల నవీన్, కరీం బాబా, భాషా, యువజన నాయకులు పాల్గొన్నారు.