రామగిరి, జూన్ 20: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్)లో ప్రవేశం కోసం నిర్వహించే ‘నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-2026 పరీక్షను ఆదివారం (ఈనెల 21న) నిర్వహించనున్నారు. మే 3న నిర్వహించిన నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో తిరిగి నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రమైన నల్లగొండలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2.065 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నాలుగు పరీక్షా కేంద్రాలు, ఎన్జీ, ఉమెన్స్, కేవీలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుంచి పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
పరీక్షా కేంద్రాలు ఇవే..