రామగిరి, జులై 03 : అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన సహకార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాధించిన విజయాలపై నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జాతీయ సెమినార్ జరునుంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ సహకారంతో ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు సెమినార్ చైర్మన్, వర్సిటీ కామర్స్ విభాగం ప్రొఫెసర్ ఆకుల రవి గురువారం తెలిపారు. సెమినార్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ జాతీయ సెమినార్లో కోఆపరేటివ్ వ్యవస్థ పునరుద్ధరణకు భారత ప్రభుత్వం తీసుకున్న 60 విప్లవాత్మక చర్యలు, గత నాలుగేళ్లలో సహకార వ్యవస్థలో సంస్కరణలు, రైతు ఉత్పత్తి సంస్థలు, మహిళా సాధికారత, సహకార వ్యవస్థ ద్వారా ఉపాధి అవకాశాలపై చర్చించనున్నారు. ఈ సెమినార్‌కు చైర్మన్‌గా కామర్స్ ప్రొఫెసర్ ఆకుల రవి, డైరెక్టర్‌గా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి వ్యవహరించనున్నారు.