నల్లగొండ రూరల్, డిసెంబర్ 25 : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ఈ నెల 28 నుంచి జనవరి 4వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 హాకీ పోటీలకు నల్లగొండ పట్టణానికి చెందిన సింగం మధు, రావుల గణేశ్, ఎండీ ఫైజాన్ ఎంపికైనట్లు నల్లగొండ హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను సోమవారం ఆయన అభినందించారు. క్రీడాకారుల ఎంపిక పట్ల ఎస్జీఎఫ్ కార్యదర్శి వాసుదేవరావు, డీఎస్డీఓ మగ్బూల్ అహ్మద్, హాకీ కోచ్ యావర్ హర్షం వ్యక్తం చేశారు.