హాలియా, డిసెంబర్ 24 : దేశాభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణ మోడల్ పాలన దేశమంతా అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. పట్టణంలోని క్యాపు కార్యాలయంలో శనివారం ఆయన సమక్షంలో అనుముల మండలంలోని కొత్తపల్లి, చింతగూడెం, తిరుమలగిరి (సాగర్) మండలానికి చెందిన సుమారు 100 కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ వెనుకబడిన తెలంగాణను గడిచిన ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారని కొనియాడారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రం అనితర సాధ్యమైన ప్రగతి సాధించిందన్నారు.
దేశాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలు పంచుకునేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బొర్రయ్య, అకనబోయిన రామకృష్ణ, అనుముల వెంకటయ్య, అన్నెపాక ఇద్దయ్య, నరేందర్, నాగయ్య, మధు, వీరయ్య, ఏసు, కొండల్, మురళి, వరప్రసాద్, పురుషోత్తం ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాల అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, ప్రధాన కార్యదర్శులు ఎన్నమల్ల సత్యం, పోతుగంటి తిరుమల్, పంగ లక్ష్మణ్, సురభి రాంబాబు, చింతగూడెం సర్పంచ్ కూరాకుల రామయ్య, గార్లపాటి ఎల్లయ్య, శాగం కోటిరెడ్డి పాల్గొన్నారు.