సూర్యాపేట/సూర్యాపేట టౌన్, మార్చి 10 : సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల రక్షణ, పౌరుల సంరక్షణకు పోలీసులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు.
అక్రమ రవాణా, అసాంఘిక చర్యలపై ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ నరసింహ కలెక్టరేట్లో కలెక్టర్ తేజల నందలాల్ పవార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవి, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, మట్టయ్య, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సీఐలు రాజశేఖర్, వీర రాఘవులు, రఘువీర్‌రెడ్డి, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, రజితారెడ్డి, రాము, ఆర్ఐ నారాయణరాజు, నరసింహ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు.