నల్లగొండ: ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి కేసులో నల్లగొండ పోక్సో కోర్టు (Pocso Court) తీర్పునిచ్చింది. దోషికి 21 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.30 జరిమానా విధించింది. 2018, ఫిబ్రవరిలో చిట్యాల పోలీసు స్టేసన్‌లో ఈ ఘటనపై కేసు నమోదయింది. 2022 నుంచి నల్లగొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.