రామగిరి, ఏప్రిల్ 30 : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమించింది. 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 17వ స్థానం దక్కింది. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 19,263 మంది విద్యార్థులు హాజరు కాగా, 18,513 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 101 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. బాలుర కంటే బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. 10జీపీఏ సాధించిన 13 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆయా స్కూల్ అధ్యాపకులు అభినందించారు.
గతం కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఈ పర్యాయం ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత సంవత్సరం పరీక్షలకు 19,236 (బాలురు 9,886, బాలికలు 9,350) మంది హాజరు కాగా, 17,234 మంది (బాలురు 8,772, బాలికలు 8,462) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89.59 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 19,263 (బాలురు 10,099, బాలికలు 9,164) మంది హాజరు కాగా, 18,513 మంది (బాలురు 9,615, బాలికలు 8,898) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 96.11 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఇందులో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు అధికంగా ఉండటం విశేషం.
15 రోజుల్లోగా రీ వెరిఫికేషన్‌కు అవకాశం
రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఫలితాలు విడుదల చేసిన నాటి నుంచి 15రోజుల వరకు అవకాశం కల్పించారు. రీ వెరిఫికేషన్ కం సప్లయి ఆఫ్ ఫొటో కాపీ ఆప్ వాల్యూడ్ (మూల్యాంకనం చేసి జవాబు పత్రం) ఆన్సర్ బుక్ కోసం ఒక్క సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని డీఈఓ బి.భిక్షపతి, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ యూసుఫ్ తెలిపారు. ట్రెజరీ చలానా ద్వారా చెల్లించాలి. దానికి హాల్ టికెట్ జతపరిచి దరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయులతో సంతకం చేయించి డీఈఓ కార్యాలయంలోని పరీక్షల విభాగంలో అందజేయాలి.
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు 16వరకు అవకాశం
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు జూన్‌లో జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు మే 16లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ భిక్షపతి సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో పరీక్షలు జరిగే రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నది. అడ్వాన్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3నుంచి 13వరకు జరుగనున్నాయి.
10జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు