సూర్యాపేట, మే 8 : ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగంగా కోనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతు గురువారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నేటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, లారీల కొరత కారణంగా కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని తెలిపారు.
ఇటీవల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వెంటనే ప్రభుత్వ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో ధాన్యంలో కోత విధించడాన్ని అడ్డుకోవాలని, అందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరారు. అనంతరం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు వినతి పత్రం అం దించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, కందాల శంకర్‌రెడ్డి, దేవరం వెంకట్‌రెడ్డి, కొప్పుల రజిత, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, పళ్ల సుదర్శన్, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మందడి రాంరెడ్డి పాల్గొన్నారు.