ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యం
ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మిర్యాలగూడలో పోలీసు సిబ్బంది, ఇతర అధికారులతో కలిసి తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు.
మిర్యాలగూడ, ఆగస్టు 5: ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మిర్యాలగూడలో పోలీసు సిబ్బంది, ఇతర అధికారులతో కలిసి తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఎన్‌హెచ్ 2, ఎన్‌హెచ్ 167 పరిధిలోని వెల్కమ్ టు మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్డు, చిల్లాపురం క్రాస్ రోడ్డు, చింతపల్లి క్రాస్ రోడ్డు, జంకు తండా రోడ్డు, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్డు తదితర బ్లాక్ స్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరిగేందుకు గల కారణాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ టేకింగ్ చేయడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రోడ్డు మారింగ్లు చెరిగిపోవడం, అక్రమ పారింగ్, రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడం తదితర సమస్యల వల్లే ఎకువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రమాదకర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్‌లు, సెం టర్ లైన్లు, రోడ్డు మారింగ్లకు రీ-పెయింటింగ్, రంబుల్ స్ట్రిప్స్, సీసీ కెమెరాలు, బారికేడింగ్, రిఫ్లెక్టివ్ బోర్డులు, దిశను చూపే సూచికలు, క్యాట్ ఐస్ తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
జంక్షన్ల వద్ద అక్రమ పారింగ్ను తొలిగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ట్రాఫిక్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి, పరిషార చర్యలు చేపట్టాలన్నారు. అనవసర జంక్షన్లు, అనధికారిక కట్స్‌ను మూసివేసి అవసరమైన చోట మాత్రమే యూ-టర్న్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్టు ధరించాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రవి, సీఐలు పీఎన్డీ ప్రసాద్, సోమ నర్సయ్య, నాగభూషణ్, నాగరాజు, ఎస్ఐ లక్ష్మయ్య, డీటీఆర్బీ ఇన్చార్జి, రిటైర్డ్ సీఐ అంజయ్య, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

