రామగిరి, డిసెంబర్ 5 : విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని దాని సాధనకు కృషి చేయాలని, విద్యార్థుల ఆసక్తిని గమనించి ఉపాధ్యాయులు వారిని ఆదిశగా ప్రోత్సహించాలని తుంగతుర్తి, నల్లగొండ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఈ నెల 3 నుంచి 5వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఈఓ బి.భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతితో కలిసి సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో చదువుల భారంతో విద్యార్థులు మానసిక సంఘర్షన పడుతున్నారన్నారు. వాటి నుంచి విద్యార్థులు బయటకి వచ్చేలా టీచర్లు ప్రత్యేకంగా పర్సనాలిటీ, కెరియర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసిన దేవరకొండలోని టీటీడబ్ల్యూఆర్‌జేసీ విద్యార్థిని టి.శిరీషకు ఎమ్మెల్యే రూ.10,116 అందించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. మన ఊరు-మనబడి ద్వారా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, మౌలిక వసతులు కల్పిస్తూ కార్పోరేట్‌కు దీటుగా రూపొందిస్తున్నదని తెలిపారు. అనంతరం సైన్స్ ఫెయిర్‌లో జూనియర్, సీనియర్ విభాగాలతోపాటు బీఈడీ, డీఈడీ ఛాత్రోపాధ్యాయులకు, ఇన్స్పైర్ మానక్‌లో విజేతలకు ఎమ్మెల్యేలు బహుమతులు అందచేశారు. సమావేశంలో డాన్‌బాస్కో విద్యా సంస్థల డైరెక్టర్ పాదర్ బాలశౌరీరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, జిల్లా గెజిడెట్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, న్యాయనిర్ణేత కమిటీ సభ్యులు అరుంధతి, ఆర్రూరి జానయ్య, చిట్టిపోలు సదానందం, యోగేంద్రనాథ్, అద్దంకి సునీల్, సాగర్ల సత్తయ్య, కర్నె శివకుమార్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రాజెక్టులు
l మల్లెల స్వాతి (జడ్పీహెచ్ఎస్ ఎంఆర్సీ, హలియా), పి.భరణి (జడ్పీహెచ్ఎస్, పెద్దకాపర్తి, చిట్యాల), ఆకులపల్లి జయరాం(టీటీడబ్ల్యూఆర్‌జేసీ, దేవరకొండ), బి.సాయిచరణ్
(టీఎస్ఎంఎస్, గుండ్లపల్లి(డిండి)
l ఈ.రాహుల్ రఘునాథ్‌రావు (టీఎస్ఎంఎస్ గుండ్లపల్లి(డిండి), ఎం.సన్వితా(జడ్పీహెచ్ఎస్
– కందుకూర్, గుండ్లపల్లి), సీహెచ్.నవీన్(జడ్పీహెచ్ఎస్
– చిన్నమాదారం, కనగల్)ఎ.స్పందన(జడ్పీహెచ్ఎస్
-కనగల్), షేక్ బషీరా(ప్రభుత్వ బాలికల పాఠశాల- నల్లగొండ)
డీఈడీ, బీఈడీ కళాశాలల విభాగంలో…
l ప్రథమ బహుమతి ఛాత్రోపాధ్యాయులు యాస్మిన్ కౌసర్, గైడ్ టీచర్ బి.రామకృష్ణ (డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్లపల్లి నల్లగొండ).
సీనియర్(హైస్కూల్) విభాగంలో
l సమాచారం అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రథమ బహుమతి ఆర్.రాఘవీరావు (ఎంవీఆర్ హైస్కూల్ నల్లగొండ), ద్వితీయ బహుతి ఆర్.అనూష (ఫ్రభుత్వ బాలికల పాఠశాల నల్లగొండ)
పర్యావరణ హితమైన పదార్థాలు
l ప్రథమ బహుమతి, ఎం.సమ్రీన్( జడ్పీహెచ్ఎస్ ముశంపల్లి), ద్వితీయ బహుతి డి.హరీశ్(జడ్పీహెచ్ఎస్ కాసనగోడు , కేతేపల్లి)
l ఆరోగ్యం మరియు పరిశుభ్రత : ప్రథమ బహుమతి ఆర్.సంజయ్ (జడ్పీహెచ్ఎస్ చర్లపల్లి నల్లగొండ), ద్వితీయ బహుతి ఎం.కార్తీక్(జడ్పీహెచ్ఎస్ నిడమనూరు)
l రవాణా మరియు ఆవిష్కరణలు : ప్రథమ బహుమతి ఎ.జయరాం (టీటీడబ్ల్యూఆర్‌జేసీ బాలురు నల్లగొండ), ద్వితీయ ఎస్.విశ్వతేజ (టీఎస్ఎంఎస్ నాంపల్లి)
l పర్యావరణానికి సంబంధించిన విభాగంలో : ప్రథమ బహుమతి పి.శృతి (జడ్పీహెచ్ఎస్ – ఎలికట్టే), ద్వితీయ కె.వెన్నెల (జడ్పీహెచ్ఎస్ – పామునుగుండ్ల)
l ప్రస్తుత ఆవిష్కరనతో చారిత్రక అభివృద్ధి : ప్రథమ బహుమతి జి.భారతి(కేజీబీవీ కట్టంగూర్), ద్వితీయ బహుతి బి.అఖిల (కేజీబీవీ దామరచర్ల)
l మన కొరకు గణితము : ప్రథమ బహుమతి జె.మాదురి (టీఎస్ఎంఎస్ వల్లాల , శాలిగౌరారం), ద్వితీయ బహుతి పి.పావణి (జడ్పీహెచ్ఎస్(జి) దేవరకొండ )
జూనియర్ (యూపీఎస్) విభాగంలో
l సమాచారం అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రథమ బహుమతి ఈ.వసంత (కేజీబీవీ వేములపల్లి), ద్వితీయ బహుతి జె.వర్షిత (కేజీబీవీ తిప్పర్తి)
l పర్యావరణ హితమైన పదార్థాలు : ప్రథమ బహుమతి పి.సాయికుమార్ (ఎంపీయూపీఎస్ నకిరేకల్), ద్వితీయ బహుతి పి.ప్రణీత్ సాగర్ (టీఎస్ఎంఎస్ కొర్లపాడు, కేతేపల్లి)
l ఆరోగ్యం మరియు పరిశుభ్రత
ప్రథమ బహుమతి – ఎం.బాల అభినయ్ -టీఎస్ఎంఎస్ కొర్లపాడు, కేతేపల్లి
ద్వితీయ బహుతి – వి.అక్షిత – ఎంవీఆర్ హైస్కూల్ నల్లగొండ
l రవాణా మరియు ఆవిష్కరణలు
ప్రథమ బహుమతి జి.రుషీ టీఎస్ఎంఎస్ కొర్లపాడు, కేతేపల్లి
ద్వితీయ బహుతి కే.వేణు – జడ్పీహెచ్ఎస్ కన్నెకల్, మాడ్గుపల్లి మం
l పర్యావరణముకు సంబందించినవి …
ప్రథమ బహుమతి ఎం.సిద్ధుకుమార్ – టీఎస్డబ్ల్యూఎస్ఆర్జేసీ (బి) నకిరేకల్, చెర్వుగట్టు
ద్వితీయ బహుతి అస్మాఫాతిమా ఎంవీఆర్ హైస్కూల్ నల్లగొండ
l ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రక అభివృద్ధి
ప్రథమ బహుమతి ఆర్.శాలోకా శ్రీ ఎంవీఆర్ హైస్కూల్ నల్లగొండ
ద్వితీయ బహుతి ఎ.శివకుమార్ – ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ పెద్దవూర
l మన కోసం గణితం
ప్రథమ బహుమతి కె.ప్రవస్తి – కేజీబీవీ కట్టంగూర్
ద్వితీయ బహుతి టి.రాజేశ్వరి – కేజీబీవీ శాలిగౌరారం