కొండమల్లేపల్లి, డిసెంబర్ 17 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుర్రపుతండా, కమాన్, కేశ్యతండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, సర్పంచులు రమావత్ అనితారాములునాయక్, గుండెబోయిన లింగంయాదవ్, రమావత్ జ్యోతీదస్రూనాయక్, రమావత్ లాలూనాయక్, విజయ్, రమావత్ తులసీరాం, రమావత్ భీమ్‌సింగ్, రమావత్ శ్రీనునాయక్, నేనావత్ శంకర్‌నాయక్, లింగంయాదవ్, ఎంపీటీసీ రాణీరాజు, రైతు బంధు సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, పస్నూరి యుగేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, మేకల శ్రీనివాస్‌యాదవ్, నేనావత్ రాంబాబునాయక్ పాల్గొన్నారు.
నాణ్యతతో పనులు చేపట్టాలి
దేవరకొండ : పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే రమాత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం 11వ వార్డులో పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రమావత్ ఉమేందర్, రాజు కృష్ణ, సీతారాం, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.