మరో ఇద్దరికి గాయాలు
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 24 : లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామ సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన సోమ వంశీ(19) ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరారు. మార్గమధ్యలో అనంతారం ఫ్లైవర్ బ్రిడ్జి వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వంశీతో పాటు అతడి ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వంశీ మృతిచెందాడు. ఇద్దరు యువకులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. వంశీ హైదరాబాద్లో బీటెక్ రెండో సంవత్పసరం చదువుతుండగా, అతని స్నేహితులిద్దరి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు.
బైక్ నుంచి కింద పడి వ్యక్తికి గాయాలు
పాలకవీడు : మండల కేంద్రం శివారులో గురువారం బైక్ పైనుంచి కిందపడడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ సైదులుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన పాలకుర్తి రాఘవ బైక్పై వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం 108లో హుజుర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.