సూర్యాపేట, అక్టోబర్ 31 : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, కేంద్ర సంఘంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే జానిమియా, దున్న శ్యామ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయన్న వ్యాఖ్యలను సంజయ్ వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరసింహాచారి, ఆకాశ్వర్మ, పావం ఆనంతరావు, ఆడగడప సైదులు, వెంకన్న, వెంకట్రావ్, శైలజ, పద్మ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యారు. మిర్యాలగూడ టీఎన్జీఓ రూరల్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు టీ.సైదులు, డీ.నారాయణస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో వి.మధుసూదనాచారి, హబీబ్, ఎండీ.నుస్రత్ అలీ, కృష్ణానాయక్, జానీపాష, అజీమ్, మౌలానా, గిరిప్రసాద్, సైదులు, సలీం, రాహుల్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, రవీందర్ పాల్గొన్నారు.