రామగిరి, ఆగస్టు 2 : నాగుల పంచమి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. వర్షం, చిరుజల్లుల నడుమ మహిళలు అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసి పుట్టల్లో పాలుపోసి భక్తిభావం చాటారు. పలు దేవాలయాల్లో కుంకుమ పూజలు ఆచరించారు. నల్లగొండ పట్టణంలోని వివిధ దేవాలయాల్లో నాగుల పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
కట్టంగూర్‌లో…
కట్టంగూర్ : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేశారు. కట్టంగూర్ సాయి మణికంఠ, శివాంజనేయ, అయిటిపాములలో సాయిబాబా దేవాలయాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
చిట్యాలలో…
చిట్యాల, ఆగస్టు 2 : మండలవాప్తంగా మంగళవారం నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో మహిళలు పుట్టలో పాలుపోసి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా వివిధ దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది.