శాలిగౌరారం, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడంతోపాటు సీఎం కేసీఆర్ నాయకత్వం నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని ఎన్జీ కొత్తపల్లికి చెందిన 10 కాంగ్రెస్ కుటుంబాలు ఎంపీపీ సలహాదారు గంట లక్ష్మమ్మ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ నివాసంలో టీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట మహేశ్ పాల్గొన్నారు.