భువనగిరి అర్బన్, జూలై 22 : రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డ వివాహ కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అందిస్తూ పెద్దన్నగా నిలుస్తున్నాడని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కొనియాడారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 40మంది, రావిభద్రారెడ్డి గార్డెన్లో మండలానికి చెందిన 105మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తన స్వంత నిధులతో పట్టు వస్ర్తాలను ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివాహం జరుగుతున్న ప్రతి ఆడబిడ్డకూ తనవంతు సాయం అందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. గత సీఎంలుగా పని చేసిన వారు పదవులు కాపాడుకోవడం తప్ప, ఏనాడూ రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే నంబర్ వన్ నిలిచారని కొనియాడారు. దేశాభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజలపై అదనపు భారం మోపుతున్న బీజేపీ వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలపై అదనపు భారాలు మోపుతున్న బీజేపీకి కాలం చెల్లే సమయం దగ్గర పడిందన్నారు.
పేదలను మోసం చేసేలా మోదీ నిర్ణయాలు : ఎమ్మెల్సీ
పేదలను మోసం చేసేలా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంపై ప్రధాని మోదీ కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జట్పీటీసీ బీరు మల్లయ్య, రైతుబంధు మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మహేందర్‌నాయక్, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక్కా రాఘవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.