నీలగిరి, జూలై 15 : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం పరిశీలించారు. సుమారు రెండు కిలో మీటర్లు ..నాలుగు గంటలకు పైగా మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, జిల్లా, మున్సిపల్ యంత్రాంగం, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి కాలినడకన తిరుగుతూ అధికారులకు సూచనలు చేస్తూ.. పనుల ప్రగతిపై సలహాలు ఇచ్చారు. ముందుగా చర్లపల్లిలో నీట మునిగిన అర్బన్, ఆక్సిజన్ పార్కును పరిశీలించి నీరు బయటకు వెళ్లే మార్గాలను అన్వేషించారు.
మర్రిగూడ జంక్షన్ నుంచి వివేకానంద విగ్రహం వరకు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. రిలయన్స్ ట్రెండ్ వద్ద జరుగుతున్న కల్వర్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పద్మానగర్ తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వను పరిశీలించిన అధికారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని సూచించారు. అక్కడి నుంచి బీట్ మార్కెట్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌తోపాటు క్లాక్ టవర్ జంక్షన్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సెంటర్‌కు మార్చనుండడంతో ఎమ్మెల్యేశంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వెంట టీఆర్ఎస్ నాయ కుడు యామ దయాకర్, డీవీఎన్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి నాగిరెడ్డి, శివ, కమిషనర్ సీసీ రఫీ పాల్గొన్నారు