విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ జలవిహార్‌లో శనివారం
నిర్వహించిన సభకు హాజరై మద్దతు తెలిపారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, సూర్యాపేట చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.