రామన్నపేట, జూలై 2: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్ ద్వారా ఆన్లైన్లో వివరాలను పొందుపర్చి తాము చదువాలను కుంటున్న కాలేజీ, గ్రూపును ఎంపిక చేసుకోవచ్చన్నారు.
తొలి విడుత రిజిస్ట్రేషన్లు ఈ నెల 30 వరకు చేసుకోవచ్చని, వెబ్ఆప్షన్లు 6 నుంచి 30 వరకు ఇచ్చుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల మొబైల్‌కు వచ్చిన ఓటీపీ, పిన్ నంబర్‌ను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ డా. యాదగిరి, అధ్యాపకులు మక్లా, సిబ్బంది జ్యోతి, శశికిరణ్, హెల్ప్‌లైన్ సిబ్బంది షరీఫ్, రాంబాబు, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు.