నార్కట్‌పల్లి జూన్ 14 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలు సేకరించుకునే హక్కుకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించారు. 15-06-2022 నుంచి 14-06-2023 వరకు దేవస్థానం ద్వారా సేకరించిన తలనీలాలను స్వాధీనపరుచుకునేందుకు సికింద్రాబాద్‌కు చెందిన ఉమశ్రీ ఎంటర్ ప్రైజెస్ రూ.2కోట్ల85 లక్షల40వేలకు దక్కించుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ఈఓ నవీన్‌కుమార్, పరిశీలకురాలు వెంకటలక్ష్మి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బొబ్బలి దేవేందర్, మారుపాకల ప్రభాకర్‌రెడ్డి, చిక్కుళ్ల యాదగిరి, రాధారపు భిక్షపతి, చీర మల్లేశ్, పర్యవేక్షకుడు తిరుపతిరెడ్డి, టెండర్‌దారులు పాల్గొన్నారు