తిప్పర్తి, జూన్ ,14 : దళితుల సంక్షేమానికే సీఎం కేసీఆర దళితబంధు పథకం చేపట్టారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లమ్మగూడెంలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన పేపర్‌ప్లేట్ తయారీ యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గంగదేవమ్మ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటు తరువాత అన్నివర్గాల ప్రజలను ఆర్థిక బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
దళితబంధు పథకం ద్వారా పొందిన యంత్రాలను సద్వినియోగం చేసుకొని దళితులు లబ్ధి పొందాలని సూచించారు. మొదటి విడుతలో భాగంగా ఎల్లమ్మగూడెం గ్రామాన్ని ఎంపిక చేసి యంత్రాలు పంపిణీ చేశామని, మిగిలిన గ్రామాల్లోనూ త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, ఎంపీటీసీ ఊట్కూరి సందీప్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.