నీలగిరి, జూలై 22 : జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నకిరేకల్ మండలంలో ఉరుములతో కూడిన వర్షం పడగా మిగతా ప్రాంతాల్లో ముసురుకుంది. అత్యధికంగా కేతేపల్లిలో-58.5 మిల్లీ మీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా నేరేడుగొమ్ములో 0.8 మిల్లీ మీటర్లు కురిసింది. మిర్యాలగూడలో-52.3, మాడ్గులపల్లి-36, నకిరేకల్-36, నల్లగొండ-33.3, శాలిగౌరారం-29.5, కట్టంగూర్-28.8, చిట్యాల-24, తిప్పర్తి- 23, వేములపల్లి-21, దేవరకొండ-18.5, పీఏపల్లి-15.8, దామరచర్ల-15.3, నార్కట్పల్లి-13.3, త్రిపురారం-13, గుర్రంపోడ్-12.5, నిడుమనూర్-11.3, మునుగోడు- 10.8, అనుముల-9, చింతపల్లి-7.8, కనగల్-7.5, చందంపేట-6.3, చండూర్-6, అడవిదేవులపల్లి-5.5, పెద్దవూర-5, కొండమల్లేపల్లి-3.3, గుండ్లపల్లి(డిండి)-2.8, మర్రిగూడ -2.8, నాంపల్లి-2.5, తిరుమలగిరి సాగర్-1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మూడ్రోజులపాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు.